స్ట్రాబెర్రీ పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. స్ట్రాబెర్రీ పండ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతాయి. దీంతో షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇంకా బరువు అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.