

చంద్రబాబుపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో జరుగుతున్న ఉగాది సంబరాలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు పాల్గొని, కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మవిశ్వాసంతో దూసుకువెళ్తున్న చంద్రబాబు ఆకాంక్ష మేరకు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని గరికిపాటి అన్నారు. ప్రజలంతా పన్నులు సకాలంలో కట్టేయాలని గరికపాటి పిలుపునిచ్చారు.