బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదవుతున్న తరుణంలో తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ఉప్పల్ బాలు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు తీయాలని అనుకోలేదని, అలాంటి ఉదేశ్యం తనకు లేదని వెల్లడించారు. 20 లక్షలు ఇచ్చినా యాప్స్ ప్రమోట్ చేయనని, ప్రజలను మోసం చేయనని తేల్చి చెప్పారు. తనను ఆదరించి యాపిల్ ఫోన్ కోసం లక్ష రూపాయలు పంపించిన నా అన్వేషణ అన్వేష్‌కు బాలు కృతజ్ఞతలు తెలిపారు.