AP: గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పెండింగ్లో ఉన్న వివిధ బిల్లులకు చెల్లింపులు చేయనున్నట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తూ సుమారు రూ.2వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. గత 3, 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, ఇరిగేషన్, నాబార్డు పనులకు పేమెంట్స్ చేస్తామని వివరించారు.