మహా కుంభమేళాలో ఆకట్టుకున్న డ్రోన్ షో (VIDEO)

51చూసినవారు
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అంగరంగ వైభవంగా సాగుతోంది. ఈ మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుండి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళా జరుగుతున్న పరిసరాల్లో 2,500 డ్రోన్లతో నిర్వహించిన డ్రోన్ షో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. మహా పరమశివుడి ప్రతిరూపాన్ని డ్రోన్ షోలో తిలికించిన భక్తులు పరవశించిపోయారు. ఒక్కసారిగా మహాశివుడి ప్రతిరూపం ప్రత్యక్షమవగానే ఆ పరిసరాలన్నీ ఓ నమ:శివయ నామస్మరణతో దద్దరిల్లిపోయింది.

సంబంధిత పోస్ట్