ఒడిశా నీలాద్రి బీచ్లో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. దీపావళిని పురస్కరించుకొని భారీ ప్రమిద ఆకారంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. సైకత శిల్పం అంచున మట్టి ప్రమిదలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఈ కళాకృతి మధ్యలో హ్యాపీ దీవాళి అని ఆంగ్ల ఆక్షరాలతో రాసి.. దాని చుట్టూ గుండ్రని ఆకారంలో మట్టి ప్రమిదలను అమర్చిన తీరు సందర్శకులను ఆకట్టుకుంది.