ఛాంపియన్స్ ట్రోఫీ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా పిచ్ ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ పిచ్‌ల క్యూరేటర్ మాథ్యూ సాండ్రే కీలక విషయాలు వెల్లడించాడు. ‘నిలకడగా బౌన్స్ లభించినా.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. వైట్‌బాల్ క్రికెట్‌లో ఫోర్లు, సిక్స్‌లే కదా ప్రేక్షకులను తీసుకొచ్చేది. అందుకే భారీ మార్పుల జోలికి మేము పోలేదు’ అని వెల్లడించారు.