భారత్‌ అత్యంత పేద దేశం: ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌

56చూసినవారు
భారత్‌ అత్యంత పేద దేశం: ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌
భారత్‌ ఇప్పటికీ అత్యంత పేద దేశమేనని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. జి20 దేశాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్నప్పటికీ.. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ పేద దేశమేనని పేర్కొన్నారు. సిఎన్‌ఎన్‌ ఇంటర్యూలో ‘ రాజన్‌ మాట్లాడుతూ.. భారత్‌లోని నిరుద్యోగ సమస్యపై విమర్శలు గుప్పించారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ రిపోర్ట్‌ ప్రకారం.. 2024 ఏప్రిల్‌ నాటికి భారత్‌లో 8.1 శాతం నిరుద్యోగం ఉందన్నారు.