కెనడాలో భారతీయ బిల్డర్‌ కాల్చివేత

50చూసినవారు
కెనడాలో భారతీయ బిల్డర్‌ కాల్చివేత
కెనడాలోని ఆల్బర్టా ప్రావిన్సు కావనాగ్‌లో భారతీయ బిల్డర్‌ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు జరిపిన కాల్పుల్లో నిర్మాణరంగ కంపెనీ యజమాని అయిన బూటాసింగ్‌ గిల్‌ (49) మృతిచెందారు. సోమవారం నివాస ప్రాంతాల నడుమ జరిగిన ఈ కాల్పుల్లో బూటాసింగ్‌తోపాటు మరో వ్యక్తి (57) మృతిచెందారు. ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ కాల్పులు ఎవరు.. ఎందుకు జరిపారు అనే వివరాలు తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్