విశ్వంలో మరో కొత్త గ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధునాతన స్పెక్టోగ్రాఫ్‌ను ఉపయోగించి ఆ గ్రహాన్ని గుర్తించామని.. ఇదో అద్భుత ఆవిష్కరణ అని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (PRL)కి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఈ గ్రహాన్ని TOI-6651Bగా పిలుస్తున్నామని తెలిపారు. శని గ్రహం పరిణామంలో ఉన్న ఈ ప్రత్యేక గ్రహం.. సూర్యుడిని పోలిన నక్షత్రం చుట్టూ తిరుగుతోందని వెల్లడించారు.