ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తాజాగా బెంగళూరులో జరిగిన టీచ్ ఫర్ ఇండియా లీడర్స్ వీక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను 'మీలా కావాలంటే ఏం చేయాలి' అని ఓ 12 ఏళ్ల విద్యార్థి ప్రశ్నించాడు. దానికి నారాయణమూర్తి బదులిస్తూ.. “నువ్వు నాలా కావాలని నేను కోరుకోవడం లేదు. ఈ దేశం కోసం నాకంటే మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అనుకుంటున్నా. ఒకరి అడుగుజాడలో నడవడమే కాదు. మనకంటూ ఓ కొత్త మార్గాన్ని వేసుకోవాలి” అని అన్నారు.