రూ.32 వేల కోట్ల పన్ను ఎగవేతపై టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ పై జీఎస్టీ అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2017-2022 మధ్యకాలంలో ఇన్ఫోసిస్ ఐజీఎస్టీని చెల్లించలేదని, ఖాతాదారుల కోసం కంపెనీ విదేశాల్లో శాఖలను ఏర్పాటు చేసిందని జీఎస్టీ డైరెక్టరేట్ జనరల్ పేర్కొంది. ఇప్పటికే ఇన్ఫోసిస్‌కు డీజీజీఐ నుంచి నోటీసులు అందినట్లు సమాచారం. దీనిపై కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది.