హైజాక్ అయిన నౌకను చేరుకున్న INS చెన్నై

2218చూసినవారు
హైజాక్ అయిన నౌకను చేరుకున్న INS చెన్నై
సోమాలియా తీరంలో హైజాక్ అయిన MV లీలా నార్ఫోక్ నౌకను ఇండియన్ నేవీ యుద్ధ నౌక INS చెన్నై శుక్రవారం చేరుకుంది. అందులో ఉన్న 15 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు నేవీ ప్రకటించింది. బందీలను విడిపించేందుకు నేవీ రంగంలోకి దిగింది. ఇక INS చెన్నై నుంచి శక్తివంతమైన హెలికాప్టర్‌ ఆ ప్రాంతంలో చక్కర్లు కొడుతోంది. హైజాక్ చేయబడిన నౌకను విడిచి పెట్టాలని సముద్ర దొంగలకు ఇండియన్ నేవీ హెచ్చరికలు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you