చైనా ప్రాంతాల పేర్లు మారుస్తాం.. ఇక మావేనా?

73చూసినవారు
చైనా ప్రాంతాల పేర్లు మారుస్తాం.. ఇక మావేనా?
అరుణాచల్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు మార్చడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘బీజింగ్‌ను నేను అడుగుతున్నా. మీ దేశంలో ప్రాంతాలకు మేం పేర్లు మారిస్తే అవి మావి అయిపోతాయా? ఇది మా ఇల్లు. పేర్లు మార్చడం వల్ల మీరేం సాధించలేరు. తప్పు చేయకండి. ఇరు దేశాల మధ్య బంధాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే, తిరిగి దెబ్బ కొట్టే సామర్థ్యం మాకుంది’ అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్