ఏడాదిలో 12 వేల కి.మీ రహదారుల నిర్మాణం

80చూసినవారు
ఏడాదిలో 12 వేల కి.మీ రహదారుల నిర్మాణం
గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) దేశవ్యాప్తంగా 12,349 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నిర్మించిందని ప్రభుత్వానికి చెందిన సీనియర్‌ అధికారి తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ఇదే రెండో అత్యధికమని పేర్కొన్నారు. 2020-21లో అత్యధికంగా 13,327 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్రం నిర్మించింది. 2022-23లో 10,331 కి.మీ, 2021-22లో 10,457 కి.మీ, 2019-20లో 10,237 కి.మీ చొప్పున రహదారుల నిర్మాణం జరిగింది.

సంబంధిత పోస్ట్