భారీ వర్షాలకు ఇంటికన్నె-కేసముద్రం రైల్వే ట్రాక్‌ ధ్వంసం

576చూసినవారు
భారీ వర్షాలకు ఇంటికన్నె-కేసముద్రం రైల్వే ట్రాక్‌ ధ్వంసం
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కేసముద్రం మండలంలోని ఇంటికన్నె-కేసముద్రం రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ శనివారం రాత్రి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరమ్మతు పనులు ప్రారంభించారు. రాత్రి, పగలు 300 మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్