ప్రపంచవ్యాప్తంగా చేసిన అధ్యయనం ప్రకారం, 19వ ప్రపంచ ఆకలి సూచీ-2024లో భారత్ 105వ స్థానంలో ఉంది. ఐర్లాండ్‌కు చెందిన కంసర్న్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా 127 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించాయి. అయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది భారత్ ర్యాంక్ మెరుగుపడింది. ఈ సూచీలో శ్రీలంక 56, నేపాల్ 68, బంగ్లాదేశ్ 84 భారత్ కంటే చాలా ముందున్నాయి.