ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును కొట్టేయాలంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పరిణామంపై డీకేఎస్ మాట్లాడారు. ‘‘ఇది కచ్చితంగా ఎదురుదెబ్బే. ఏం చేయమంటారు?. పైగా ఇది అన్యాయం’’ అని అన్నారు. ‘నాపై సీబీఐ కేసు.. దర్యాప్తు రాజకీయ ప్రతీకార చర్య అని ప్రతీ ఒక్కరికీ తెలుసు’ అని పేర్కొన్నారు.