మలక్‌పేటలో ఆదివారం శిరీష అనే వివాహిత అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. శిరీష గుండెపోటుతో మరణించినట్లు ఆమె భర్త అందరిని నమ్మించాడు. అయితే శిరీషది సహజ మరణం కాదని హత్య అని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమె భర్త వినయ్, శిరీషను దిండు అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వినయ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.