తెలంగాణలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉదయం మత్స్యావతార అలంకరణలో నృసింహుడు భక్తులకు దర్శనమిచ్చాడు. పూజల అనంతరం స్వామిని వీధులు గుండా మేళతాళాలు, వేదమంత్రాల మధ్య ఊరేగించి, తూర్పు రాజగోపురం వద్ద అధిష్ఠింపజేశారు. ఉత్సవ మూర్తి ఊరేగింపును చూసి భక్తులంతా తరిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.