ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మరి కొంతమంది కేంద్ర మంత్రులతోనూ సీఎం రేవంత్ భేటీ కానున్నారు.