జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో గత వారం రోజులుగా రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. తాజాగా సోమవారం ఉదయం 15 °C గా నమోదైంది. చలితీవ్రత పెరగడంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఉదయం నడక వారు, నిత్య కృత్యాల్లో భాగమైన ఇల్లూ వాకిళ్లు శుభ్రం చేసుకునే మహిళలు చలి తీవ్రతకి స్వెట్టర్, చెవులకు మఫ్లర్లు ధరించి వారి వారి పనుల్లో పాల్గొన్నారు.