

రాజారాంపల్లి: కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆర్య వైశ్యుల పాలాభిషేకం
రాజీవ్ యువ వికాసం పథకానికి ఆర్య వైశ్యులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినందుకు పేద ఆర్య వైశ్య కుటుంబాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజారాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నేతల చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్త, గంప సంతోష్, రావికంటి లక్ష్మణ్, రాయించు సదాశివ్, చౌడారపు సాగర్, చిట్టిమల్ల రమేష్, సంతోష్, మల్యాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.