భూమిపై నూకలు మిగిలున్నాయంటే ఇదేనేమో. తమిళనాడులోని పట్టుకొట్టాయ్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. అదృష్టవశాత్తు ఆయనకి ఒంటిపై ఎలాంటి గాయాలు కాలేదు. కింద పడిన అతడు తనకు ఏమీ కాలేదన్నట్లు తన దారిన వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంట్రుక వాసిలో మరణం తప్పిపోయిందంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.