

అసెంబ్లీలో పాట పాడిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి (వీడియో)
AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో జగన్ చేసి అప్పులను పాట రూపంలో పాడి అసెంబ్లీలో ఉన్నఎమ్మెల్యేలకు వినిపించారు. దీంతో కొలికపూడి పాడిన పాటకు కూటమి నాయకులు నవ్వుల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.