తెలంగాణ ప్రభుత్వం.. సినీ నటులకు ఇచ్చే గద్దర్ అవార్డులకు సంబంధించి తాజాగా విధివిధానాలు ఖరారు చేసింది. ఈ పురస్కారాన్ని ఫీచర్, జాతీయ సమైక్యత, బాలలు, హెరిటేజ్, పర్యావరణం, చరిత్ర, డెబిట్ ఫీచర్, యానిమేషన్, సోషల్ ఎఫెక్ట్స్, డాక్యుమెంటరీ చిత్రాలకు ప్రధానం చేయనున్నారు. నటులు, టెక్నీషియన్లతోపాటు తెలుగు సినిమాలపై పుస్తకాలు, వ్యాసాలు రాసినవారికి కూడా ఈ అవార్డులు ఇస్తారు. అయితే BRS హయాంలో వచ్చిన సినిమాలకు సైతం ఈ అవార్డు ఇవ్వనున్నారు.