ఆర్‌ఆర్‌ఆర్‌కు 2నెలల్లో అన్ని అనుమతులు: మంత్రి కోమటిరెడ్డి

82చూసినవారు
ఆర్‌ఆర్‌ఆర్‌కు 2నెలల్లో అన్ని అనుమతులు: మంత్రి కోమటిరెడ్డి
TG: రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "సంగారెడ్డి-భువనగిరి-చౌటుప్పల్‌ వరకు టెండర్ల పక్రియ పూర్తయింది. HYD-VJA జాతీయ రహదారి 6 లేన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గడ్కరీ ఆదేశించారు. 2 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలన్నారు" అని అన్నారు.

సంబంధిత పోస్ట్