రాజధానిలో రూ.40వేల కోట్ల నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ ఆమోదం (వీడియో)

69చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం అమరావతిలో సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. రూ.40వేల కోట్ల విలువైన రాజధాని నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ సమావేశంలో ఆమోదం తెలిపారు. కాంట్రాక్టు ఏజెన్సీలకు లెటర్ ఆఫ్‌ అగ్రిమెంట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ పూర్తయ్యాక రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్