బాన్సువాడ: మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాలి

72చూసినవారు
బాన్సువాడ: మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాలి
హైదరాబాద్, బోధన్ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న తమకు ప్రస్తుత మార్కెట్ రేట్‌కు అనుగుణంగా పరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం బాన్సువాడలో సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంతో పాటు బూర్గుల్ గ్రామ శివారులో రహదారి విస్తరణ పనుల్లో భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ. 30 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.

సంబంధిత పోస్ట్