బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వరాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు చిదుర వీరేశం సోమవారం రుద్రూర్ లో తెలిపారు. గతంలో ఆలయంలో పలుమార్లు దొంగతనాలు జరగడంతో ఆలయ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.