క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సన్మానం

375చూసినవారు
క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సన్మానం
మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించడం జరిగింది. గ్రామ యువజనులు సంజు (ఓమ్) పటేల్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేసి జయంతి నిర్వహించడం జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి ఓమ్ వివేకానంద స్వామి యొక్క అడుగుజాడలలో ప్రతి ఒక్కరు నడిచి మంచి పేరు ప్రఖ్యాత సాధించాలని కోరారు. మంచిగా చదివి భవిష్యత్తును ఉజ్వలం చేసుకోవాలని కోరారు. ఉపాద్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఆలోచించి పాఠ్య పుస్తక జ్ఞానం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు కూడా ఉపాద్యాయులు చెప్పే విషయాలను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ తో వింటే మంచిగా అర్థం కావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెనూర్ గ్రామస్థులు, యువజనులు, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్