నిరోద్యోగుల కోసం గ్రంధాలయం కు గ్రూప్స్ పుస్తకాల అందజేత

652చూసినవారు
నిరోద్యోగుల కోసం గ్రంధాలయం కు గ్రూప్స్ పుస్తకాల అందజేత
మద్నూర్ గ్రామానికి చెందిన బస్లింగ్ ( మోచి)   చిన్న కుమారుడు  యు. అశోక్  ( సబ్ రిజిస్టర్ ) అధికారిగా విదులు నిర్వహిస్తున్నారు. మద్నూర్ కేంద్రంలో 2000-2001 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి బ్యాచుకు చెందిన అశోక్ గ్రంధాలయం లో నిరోద్యోగుల కు ఉప యోగ పడే పుస్తకాలు గ్రామ పెద్దలు వారి సమక్షంలో ఇవ్వడం జరిగింది.

ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ దరస్వార్ సురేష్ , పశు వైద్యుడు విజయ్ బండివార్ , హన్మండ్లు చౌలవార్ , తుం హన్మండ్లు , నాగనాథ్ పటేల్ రౌత్వార్ , కృష్ణా పటేల్ , ప్రకాష్ సెట్ తదితరుల సమక్షంలో గ్రంధాలయం కు పుస్తకాలు అందజేశారు. సమావేశంలో యు. అశోక్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రాష్ట్ర సరిహద్దు  మద్నూర్  మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం శ్రమిస్తున్న వారికి గ్రూప్ -1, గ్రూప్ -2 , గ్రూప్ -4 , పోలీస్ శాఖకు కు సంబందించిన అన్ని రకాల పుస్తకాలు గ్రంధాలయంలో సౌకర్యాలు కల్పించడం జరిగింది అన్నారు. గ్రంధాలయం లో నిరోద్యోగులు ఇక్కడ వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఆయా పుస్తకాల ద్వారా సంబంధిత విషయం తో పరీక్షల కోసం  కష్ట పడి అధిక మార్కులు సాధించి వారు కూడా ఉన్నత స్థానాలలో ఉద్యోగాలలో స్థిర పడి తల్లిదండ్రులు , గురువులు , గ్రామ పెరు ప్రఖ్యాత సాధించాలని కోరారు.

గ్రూప్స్ కానీ పోలీస్ జాబ్ కొరకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మానసికంగా కుంగిపోకుండా , మంచి వాతావరణం లో ప్రశాంతంగా , ఏకాగ్రత తో ప్రతి రోజు సమయ పాలన
ద్వారా చదువుతూ ముందుకు సాగితే ఉన్నత లక్ష్యం చేరుకోవొచ్చు అన్నారు. ముఖ్యంగా 6వ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను క్షుణంగా చదివి వాటిని ఒక నోట్స్ తయారు చేసుకొని చదవాలని కోరారు. ఉద్యోగం సాధిస్తాను అనే నమ్మకం మనలో ఏర్పరచుకొని ముందుకు సాగి  కష్టపడి చదవాలని కోరారు.  


అలాగే మేజర్ గ్రామ సర్పంచ్ దరస్వార్ సురేష్ మాట్లాడుతూ యు. అశోక్  పేద కుటుంబంలో పుట్టి మనోధైర్యంతో  ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి ఉన్నత చదువులు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి 2006 డియస్సి లో ఉపాద్యాయుడిగా  ఉద్యోగం సాధించి మండలంలోని లచ్చన్ గ్రామంలో విదులు నిర్వహించడం జరిగిందని గ్రూప్ -2  ద్వారా వాణిజ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కూడా సాధించడం జరిగిందన్నారు. కానీ ఉద్యోగం లో చేరకుండా ఉపాద్యాయుడిగా కొనసాగిస్తూ గ్రామానికి చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ మరోసారి గ్రూప్ - 2 లో సబ్ రిజిస్టర్ ఉద్యోగం పొంది ఇతర  జిల్లాలో విదులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అశోక్ కు గ్రామస్తులు శాలువా తో సన్మానం చేసి అభినందించడం జరిగింది.

హీరో నాగార్జున నిర్వహించునటువంటి మిలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాంలో మొదటి వ్యక్తిగా సెలెక్ట్ అయ్యి 6. 30 లక్షల రూపాయలు గెలుపొంది హీరో నాగార్జున యొక్క ఆశీర్వాదాలు పొందారాణి ఇంటర్ , డిగ్రీ , పి. జి. చదివి ఉద్యోగాల కోసం కష్ట పడి చదువుతున్న వారు యు. అశోక్ కు ఆదర్శంగా తీసుకోవాలని నిరోద్యోగులు కూడా అశోక్ లాగా ప్రభుత్వ కొలువులు సాధించి గ్రామ పెరు, ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. మద్నూర్ గ్రంధాలయంలో ఉద్యోగాల కోసం అవసరమయ్యే పుస్తకాలు (మెటీరియల్స్) అందుబాటులో ఉన్నందున నిరోద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రూప్స్ కు సంబందించిన పుస్తకాల అందించే కార్యక్రమంలో అతని యొక్క పదవ తరగతి బ్యాచు కు చెందిన స్నేహితులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్