హైదరాబాదులో సోమవారం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కార్యాలయంలో కార్యదర్శి సైదులుకు లోది కులస్తులను బీసీ జాబితాలో ఉన్న బీసీ-డి నుండి బీసీ-బి లోకి చేర్చాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్, జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆకుల లక్ష్మణ్ యాదవ్, లోది సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎర్ర రమేష్, రాజు, సాయిలు, లాలయ్య పాల్గొన్నారు.