భూమ్మీద పడే ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టుకుని భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులు సతీష్ యాదవ్ అన్నారు. భూగర్భ జల శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు క్రింద భూగర్భ జలాల నిర్వహణ, నియంత్రణ, స్థిరమైన అభివృద్ధి అంశాలపై మంగళవారం మాచారెడ్డి భవానిపేటలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. నీటిని పొదుపుగా వాడుకుని భావితరాలకు అందించాలన్నారు.