నాగిరెడ్డిపేట మండలం మెట్లకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలో బడి ఈడు విద్యార్థులపై గురువారం విద్యాశాఖ క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌లు రాజయ్య, కృష్ణ స్వామి సర్వే నిర్వహించారు. మెల్లకుంట తండా గ్రామానికి చెందిన లకావత్ శంకర్ కూతురు సంధ్య ఏడో తరగతి పూర్తిచేసి బడికి వెళ్లకుండా ఇంటివద్దనే ఉండటాన్ని గుర్తించి వెంటనే బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.