కర్ణాటకలోని బీదర్‌లో గురువారం పట్టపగలు ఏటీఎం వాహనంపై కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డ దొంగలు హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌కు చేరుకోగా.. వారిని వెంటాడుతూ బీదర్ పోలీసులు కూడా వచ్చారు. రోషన్ ట్రావెల్స్ బస్సులో ఎక్కి రాయ్‌పూర్‌కు రెండు టికెట్లు కొన్నారు. బస్సు ఎక్కాక పట్టుకుందామని చూసిన పోలీసులపై 3 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులతో కలిసి కర్ణాటక పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.