విక్టరీ వెంకటేశ్ తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సంక్రాంతి సెలవులు కావడంతో కుటుంబాలతో కలిసి జనాలు థియేటర్‌లకు క్యూ కడుతున్నారు. అన్ని షోలు దాదాపు హౌస్‌ఫుల్‌తో నడుస్తున్నాయి. ఈ క్రమంలో సినిమాకు వస్తున్న ఆదరణ దృష్ట్యా ఏపీ, తెలంగాణల్లో అదనంగా 220+ షోలను ప్రదర్శించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది.