తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ఒక కోటి (1,00,52,598) దాటడం ఎంతో గర్వకారణమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదులో ఇదో గొప్ప రికార్డు అని వెల్లడించారు. అసాధారణమైన ఈ లక్ష్యాన్ని చేరుకున్న వేళ TDP కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మహా క్రతువులో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు, నాయకుడికి అభినందనలు తెలిపారు. కార్యకర్తల కష్టమే ఈ ఫలితమని స్పష్టం చేశారు. ఈ ఘనత తనకు ఎనలేని సంతృప్తిని ఇచ్చిందన్నారు.