ఎల్లారెడ్డి పట్టణంలో రామాలయం బావిని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన కట్టడాన్ని చుట్టూ కలియ తిరుగుతూ.. బావిలో దిగి, పరిసరాలు స్వయంగా చూసారు. కలెక్టర్ వెంట ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, తాసిల్దార్ మహేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, అధికారులు పాల్గొన్నారు.