
కళ్యాణి గ్రామంలో ఘనంగా హోలీ వేడుకలు
ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో శుక్రవారం హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హోలీని ఘనంగా జరుపుకుంటామన్నారు.