డీజీ చెప్పిన నోటిమాటతో నాటి సీపీ కాంతిరాణా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. కాదంబరి అరెస్టుకు ఆదేశించడంతో పాటు ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఒకరోజు ముందే విమాన టికెట్లు బుక్ చేయించడంలో కాంతిరాణా పాత్ర ఉంది. ఆయన సీసీ నాటి డీసీపీ విశాల్ గున్ని, ఏడీసీపీ రమణమూర్తి, ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై షరీఫ్‌లకు ఫిబ్రవరి 1న ప్రయాణానికి విమాన టికెట్లు బుక్ చేశారు. అప్పటికీ జెత్వానీకి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.