వెల్గటూర్ మండలంలోని కుమ్మరిపల్లి ఆదర్శ విద్యాలయంలో సోమవారం జాతీయ వ్యాయామ దినోత్సవం సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ గంగాధర్ ను ప్రధానోపాధ్యాయులు కృష్ణ ప్రసాద్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వ్యాయామం అనేది విద్యార్థులకు అవసరం. ఎందుకంటే వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆలోచన విధానం మెరుగవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.