
ధర్మపురి: బీజేపీ నాయకుల తిరంగా యాత్ర
ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని త్రివిధ దళాల సేవలకు కృతజ్ఞతగా, అలాగే భారతదేశ ఐక్యత, సమైక్యతను ప్రజలకు చాటిచెప్పే ఉద్దేశంతో సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కోసం శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో బిజెపి పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి పట్టణ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.