హుజురాబాద్ మండలం - Madurai

తాసిల్దార్ కార్యాలయం ముందు హమాలి కార్మికుల ధర్నా

తాసిల్దార్ కార్యాలయం ముందు హమాలి కార్మికుల ధర్నా

తాసిల్దార్ కార్యాలయం ముందు తాడికల్ సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల హమాలి కార్మికులు కూలీ రేట్లు పెంచాలని, బీహార్ కార్మికులను పనిలో పెట్టుకోకూడదు, ఈ విషయంపై ఎక్కువ చోరువ చూపి సొసైటీ చైర్మన్ రైతులకు అమాలి కార్మికులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి గ్రామాలలో ప్రజల మధ్య అశాంతి చర్యలకు గురి చేస్తున్నాడని అలాంటి వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో తాసిల్దారు తీసుకుని కూర్చుండ బెట్టి సామరస్య పూర్వకంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో గతంలో ఏవైతే ఉన్నాయో కూలీ రేట్ల ప్రకారం వర్తింపు చేయాలని, బీహార్ కార్మికులను ఎంత డబ్బులు కేటాయించారు అంత వరకు పని వినియోగించుకుని, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా సొసైటీ పాలక వర్గాన్ని ఆదేశించారు. సొసైటీ పాలకవర్గం కూడా సానుకూలంగా స్పందించింది. కార్మికులు కూడా పని చేస్తామని స్థానిక ప్రజానీకానికి ఉపాధి కల్పించే విధంగా సొసైటీ పాలకవర్గం ఆలోచించాలని అమాలి కార్మికులు కూడా రైతుల్లో పని చేస్తున్నాము .రైతుల బాధలు అందరికీ తెలిసినవే రైతు యొక్క హక్కులకోసం కార్మిక సంఘంగా, రైతు సంఘాలు గా, సొసైటీ పాలకవర్గం కూడా కలిసి ఉండాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పాలకవర్గానికి సూచించారు. కాకపోతే తాసిల్దార్ ప్రతి గ్రామాల్లో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ చర్చలు సానుకూలంగా జరగడం వల్ల ఎక్కడికక్కడ అమాలి కార్మికులు పాత రేట్ల ప్రకారం పనులు చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, నాయకులు ఎస్ డి బాబా, రాజన్న ,రాగుల కొమురయ్య, శ్రీనివాసు ,తిరుపతి, రాజయ్య, బాలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా
టీఆర్ఎస్ పార్టీకి జన్మనిచ్చిన పురిటి గడ్డ కరీంనగర్ : కేటీఆర్
Nov 29, 2024, 17:11 IST/మానకొండూర్
మానకొండూర్

టీఆర్ఎస్ పార్టీకి జన్మనిచ్చిన పురిటి గడ్డ కరీంనగర్ : కేటీఆర్

Nov 29, 2024, 17:11 IST
టీ ఆర్ ఎస్ అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటి గడ్డ కరీంనగర్ అని కేటీఆర్ కొనియాడారు.'కరీంనగర్ లో జరిగిన సింహా గర్జన ద్వారానే కేసీఆర్ దేశానికి పరిచయమ్యారు. ఎంపీ ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీ ఇచ్చి టీ ఆర్ ఎస్ ను గెలిపించారు. 2009 ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ఓడిపోయిందన్నప్పుడు చాలా మంది అవమానకరంగా మాట్లాడారు. కానీ కేసీఆర్ కరీంనగర్ వేదికగా నా శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్రనో అంటూ గర్జించారు. కరీంనగర్ ప్రజల పోరాట స్ఫూర్తి లేకుంటే తెలంగాణ సిద్ధించేదో లేదో తెలియదు అని వ్యాఖ్యానించారు.