జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

75చూసినవారు
జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ
జగిత్యాల జిల్లాలో అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదన్నారు.

సంబంధిత పోస్ట్