జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల నిర్మాణ కమిటీ ఇన్ ఛార్జ్ పోడేటీ సునీల్ మాదిగ ఆధ్వర్యంలో సోమవారం మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం మాదిగ, ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్ మాదిగ హాజరైనారు. వారు మాట్లాడుతూ మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు నూతన మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.