ధనుర్మాస సహస్ర దీపోత్సవం
ధనుర్మాసం సందర్భంగా జమ్మికుంటలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సహస్ర దీపోత్సవం నిర్వహించారు. విభిన్న రకాల ఆకృతులతో దీపాలను అలంకరించి, ఆరాధనలు చేశారు. సహస్ర దీపోత్సవానికి దేవాలయ కమిటీ ఛైర్మన్ ముక్కా జితేందర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌కు చెందిన దాత పల్లెర్ల సంతోష్ దేవాలయ వంటశాల నిర్మాణానికి చేయూత ఇవ్వగా భూమి పూజ చేశారు.