సన్నవరి సాగు చేసిన తెలంగాణ రైతులకు కేంద్రం ద్రోహం చేసింది

752చూసినవారు
సన్నవరి సాగు చేసిన తెలంగాణ రైతులకు కేంద్రం ద్రోహం చేసింది
బోయినపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ లో వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగైన వరి ధాన్యం,పత్తి,మక్క పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గరనుండి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ తెలంగాణ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు.

రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని వరి ధాన్యం 17శాతం తేమకు లోబడి తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. తాలు,పొల్లు లేకుండా ఎండబోసిన వరిధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులను కోరారు.

ట్యాగ్స్ :