కొడిమ్యాల మండలంలో విషాదం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని సూరంపేటలో నక్క సాయి (28) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికి భార్య, కొడుకు ఉన్నారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.