ఉప సర్పంచ్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన కలెక్టర్

1488చూసినవారు
ఉప సర్పంచ్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన కలెక్టర్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉమ్మారెడ్డి బాపు రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీఓ గంగాధర్ బుధవారం తెలిపారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ది పనులకు సంభందించిన బిల్లులపైన సంతకాలు పెట్టకుండా వేధిస్తున్నాడని గ్రామ సర్పంచ్ పిల్లి మల్లేషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన మండల అధికారులు రిపోర్టును కలెక్టర్ కు అందించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ 15 రోజుల్లో వివరణ అందజెయ్యాలని ఉప సర్పంచ్ కు షాకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్